Guntur Kaaram Trailer : చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ?


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12, 2024 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గుంటూరు కారం’ ట్రైలర్ రానే వచ్చింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ట్రైలర్ లో.. మహేష్ బాబు ఊర మాస్ లుక్, డైలాగ్స్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసాడు. ట్రైలర్ చూస్తుంటే ఈసారి అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయం అనిపిస్తుంది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రీలీల తన అందంతో ఆకట్టుకుంటుంది. మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, రావు రమేష్, అజయ్ ఘోష్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.