The Paradise : నాని ‘ది పారడైజ్’లో హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ పార్ట్ షూటింగ్!


The Paradise : నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ తరువాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జతకట్టిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ షూటింగ్ పూర్తి ఉత్సాహంగా సాగుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో నిర్మించిన మ్యాసివ్ సెట్‌లో యాక్షన్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ సీన్స్ కోసం ఫారిన్ స్టంట్ మాస్టర్స్ సహా టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలతో ఇప్పటికే సినిమాపై భారీ బజ్ క్రియేట్ కాగా, అందులో నాని మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ‘ది పారడైజ్’ ఒక గ్లోబల్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.