AA22: అల్లు అర్జున్ సినిమాలో హాలీవుడ్ విలన్.. అట్లీ రిస్క్ చేస్తున్నాడా..?

Allu

AA22: ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘AA22’ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్టులో ఇప్పటికే దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో అధికారికంగా చేరగా, జాన్వీ కపూర్ కూడా చివరి దశ చర్చలలో ఉన్నట్లు సమాచారం. ఇక పుష్పా సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా నటించిన రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా, రష్మిక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుందని, ఆమెకు తోడుగా మరో ప్రముఖ స్టార్ హీరో కూడా ప్రతినాయకుడిగా కనిపించనున్నారని టాక్. ఈ పరిణామం అభిమానులను మరింత ఉత్సాహంగా మారుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో ముంబైలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసినట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా రూపొందించేందుకు భారీ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ ఉన్న యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ప్రస్తుతం ఈ సినిమాను 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తుండగా, షూటింగ్ వేగంగా సాగితే 2026 డిసెంబర్ లేదా దీపావళి సమయానికి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అత్యంత హైలైట్ అవుతోన్న విషయం ఏమిటంటే.. విలన్ పాత్ర కోసం హాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలన్న ప్రణాళిక. ప్రస్తుతం విల్ స్మిత్, డ్వేన్ జాన్సన్ (ది రాక్) పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్.

అయితే రెమ్యూనరేషన్, షెడ్యూల్, ట్రావెల్, సెక్యూరిటీ సమస్యలు ఈ కాంబోను సాధ్యం చేయడాన్ని కష్టతరం చేస్తుండొచ్చు. పైగా భారతీయ మాస్ ప్రేక్షకులు హాలీవుడ్ విలన్‌ను ఎలా అంగీకరిస్తారన్నదీ ప్రశ్నే. అయినా నిర్మాతలు తమ విజన్‌పై దిగజారకుండా, పెద్దదే చేయాలని పట్టుదలగా ఉన్నారు. ‘జవాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అట్లీ తన స్పీడ్, పర్ఫెక్షన్‌తో AA22ను ఓ గ్లోబల్ సినిమా లాగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి VFX కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ షూటింగ్ విషయంలో సమన్వయం ఏర్పరుచుకుంటూ, కంట్రోల్ మిస్ కాకుండా పకడ్బందీగా పనులు జరుపుతున్నారని సమాచారం. ఇది కేవలం ఓ పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ గ్లోబల్ సినిమా. ఈ సినిమాతో ఇండియన్ కమర్షియల్ సినిమాకి ఓ కొత్త రూపం ఇవ్వాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే మరిన్ని సర్ప్రైజ్ ఎనౌన్స్మెంట్లు వచ్చే అవకాశముంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ఇంటర్నేషనల్ స్టేజ్‌ లో కూడా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ‘AA22’ అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.