
WAR 2 : బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యూనివర్స్ అయిన YRF స్పై యూనివర్స్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యున్నత స్థాయిలో నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో మూడు ప్రధాన పాత్రల పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌ను చూపిస్తూ, సినిమాకు ఉన్న భారీ స్కేల్‌ను హైలైట్ చేస్తూ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘వార్ 2’ ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్-ఇండియా రిలీజ్ గా మారే అవకాశముంది. హై-ఆక్టేన్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
The wait ends soon. The war begins… #30DaysToWar2#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. @iHrithik | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/GocWLNEnSR
— Jr NTR (@tarak9999) July 16, 2025












