రివ్యూ : జూనియర్

Junior review
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5

జూనియర్ రివ్యూ: ఎమోషన్స్‌తో కదిలించిన కిరీటి డెబ్యూ!
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం “జూనియర్”, వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించగా, కర్ణాటకలో విజయవంతమైన సినిమా రూపొందించిన రాధాకృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీలీలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జెనీలియా చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే “వైరల్ వయ్యారి” సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, ట్రైలర్ ఆకట్టుకోవడం వల్ల సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది, కథ, నటన, టెక్నికల్ అంశాల పరంగా ఎలా ఉంది అనేది ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ : “జూనియర్” కథలో అభి (కిరీటి) తన తండ్రి కోదండపాణి (రవిచంద్రన్)తో ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల ఎమోషనల్‌గా విసిగిపోతూ, స్వతంత్రత కోసం బయటకు వెళ్లి జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తాడు. కాలేజీ పూర్తయ్యాక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో విజయ సౌజన్య (జెనీలియా) కంపెనీలో చేరిన అభికి, మొదటి రోజే ఆమెతో ఘర్షణ జరుగుతుంది. అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల ఆమె సీఈఓ కావడం ఆగిపోతుంది. కానీ తర్వాత ఆమె గురించి తెలిసిన ఓ షాకింగ్ నిజం అభి జీవితాన్ని తారుమారుగా మార్చేస్తుంది. విజయ సౌజన్య తండ్రి రావు రమేష్, అభి తండ్రి కోదండపాణికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ ముగ్గురి మధ్య ఉన్న గత రహస్యాలు ఏమిటి? చివరికి అభి తన తండ్రితో సంబంధాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు? అన్నదే మిగతా కథ.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

విశ్లేషణ : “జూనియర్” కథ పెద్దగా కొత్తదనం లేకపోయినా, ఈ సినిమాను నిలబెట్టిన అసలు బలమైన అంశం కిరీటి నటన. తన మొదటి చిత్రమే అయినా, కిరీటి స్క్రీన్ మీద అనుభవజ్ఞుడిలా కనిపించాడు. ఎమోషనల్ సీన్లు, డాన్స్, ఫైట్స్ – అన్ని విభాగాల్లోనూ అతని ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. అభి పాత్రలో తనదైన నైజంతో జీవించాడు. కథ ప్రారంభం నుంచి జెనీలియా ఎంట్రీ దాకా అతని జర్నీ ఆసక్తికరంగా సాగుతుంది. తరువాత వచ్చే ఎమోషనల్ ఇంటర్వెల్ ట్విస్ట్ కథను మరింత బలోపేతం చేస్తుంది. ఈ కథ కొత్తదేమీ కాకపోయినా, కిరీటి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుడిని కట్టిపడేస్తాడు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

సెకండ్ హాఫ్‌లో కథ ఊహించదగినదిగా నడవడం కొంత నెగెటివ్ అయితేనూ, కిరీటి తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నడిపించిన విధానం అభినందనీయంగా ఉంటుంది. జెనీలియా తన పాత్రకు న్యాయం చేసింది, శ్రీలీల పాత్ర పరిమితమైనదే అయినా స్టొరీ నుంచి మరలకుండా ఉండటం ప్లస్. రావు రమేష్, రవిచంద్రన్ నటనతో తమ స్థాయిని చాటారు. సెంథిల్ కుమార్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఎడిటింగ్—all together సినిమాకు రిచ్ ఫీల్ తీసుకొచ్చాయి. కానీ ఆన్ని అంశాల్లోనూ కిరీటి ఒక వన్ మ్యాన్ షోలా మెరిశాడు.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5