
KINGDOM : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తెలుగు సినిమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 30 వేల టికెట్లు సేల్ అవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీంతో ‘కింగ్డమ్’ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజ్ చూసిన మేకర్స్, దేశ వ్యాప్తంగా భారీగా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న ప్రీమియర్స్ జరగనున్నాయి. ఓవర్సీస్‌లోనూ ప్రీ సేల్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా మీద ఉన్న హైప్ మరింత పెరిగింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండకు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా సినిమా విజయంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.












