
Mirai : ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12 న విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటి, ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం ముగిసే వరకు 112 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో అధికారకంగా ప్రకటించింది. దీంతో తేజా కెరీర్లో ఈ సినిమా ‘హనుమాన్’ తర్వాత మరో వంద కోట్లు దాటిన సినిమాగా నిలిచిపోతుంది.
#SuperYodha slaying in style at the box office 🥷💥
112.10 Cr+ Gross Worldwide in the First Week for #BrahmandBlockbusterMirai ❤️🔥❤️🔥❤️🔥#Mirai continues its Brahmand domination and enters second week 🔥
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/aCrshq0RBE— People Media Factory (@peoplemediafcy) September 19, 2025
ప్రేక్షకుల్లో మొదటినుంచి ఈ సినిమాపై ఏర్పడిన బజ్, చిత్ర యూనిట్ సమర్థవంతమైన ప్రమోషన్ వ్యూహం సినిమాకు భారీ కలక్షన్లను అందించాయి. అయితే, ఇప్పుడు దసరా సెలవులు మొదలవడంతో పాటు, మరో వారం రోజుల వరకు ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం వుంది. విదేశాల్లోనూ మంచి స్పందనతో ‘మిరాయ్’ మరింత చర్చనీయ అంశంగా నిలిచింది. ఇకపోతే హీరో తేజ సజ్జా ఈ వీకెండ్ సియాటెల్, డల్లాస్ మరియు న్యూ జెర్సీకి వెళ్ళి అభిమానులతో సమావేశమవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
USA 🇺🇸
Get ready to meet and greet your favourite Indian Superhero 🇮🇳 ❤️#SuperYodha @tejasajja123 & team #Mirai are coming to celebrate their sensational success with you all 💥💥💥Check out the schedule and join the celebration ✨
North America Release by @ShlokaEnts… pic.twitter.com/rgBgi1VP4f
— People Media Factory (@peoplemediafcy) September 19, 2025












