Kantara Chapter 1 : కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సెన్సేషన్.. 24 గంటల్లోనే ?

Kantara chapter1
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ 2022లో పాన్-ఇండియా హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో ప్రభాస్ లాంచ్ చేయగా, ఇతర భాషల్లో హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 107 మిలియన్ వ్యూస్, 3.4 మిలియన్ లైక్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత మేకింగ్, విజువల్స్, నిర్మాణ విలువలపై చర్చ మొదలైంది. ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచిన ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!