Kantara Chapter1 : ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

Kantarachapter1
Kantara Chapter1 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ అందించారు మేకర్స్.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌లో పాల్గొనడం, చిత్రానికి మరింత ప్రచారం కలిగించడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో సినిమా పై అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా, రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.