
Jatadhara : సుధీర్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మిథాలజికల్ థ్రిల్లర్ ను జీ స్టూడియోస్, ఉమేష్ కే.ఆర్. బంసల్ మరియు ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్, ప్రమోషనల్ సాంగ్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ ట్రైలర్ ను రేపు అక్టోబర్ 17, 2025న హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదల కానుంది
Our Lucky charm, our GlobeTrotter, our Superstar Mahesh Babu unveils the trailer of Jatadhara TOMORROW 🔥
Witness #Jatadhara in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔#JatadharaOnNOV7#AwakeningBegins#UmeshKrBansal #PrernaArora @zeestudios_ @shivin7 #ArunaAgarwal… pic.twitter.com/pRtycXZQvw
— Zee Studios South (@zeestudiossouth) October 16, 2025












