Samyuktha : ‘అఖండ 2’ సాంగ్ విన్నప్పుడు నెర్వస్ అయ్యా.. ఎందుకంటే ?

Samyuktha
Samyuktha : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’ 2D, 3D ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

సినిమాల్లో బిజీగా ఉండటం ఎలా అనిపిస్తుందనే ప్రశ్నకు సంయుక్త మాట్లాడుతూ, “ఆనందంగా ఉంది. విరూపాక్ష తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. నేను మాత్రం సెలెక్టెడ్ గా చేస్తున్నాను. బింబిసారా, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. కానీ వాటి రిలీజ్ టైమ్స్ వేరే విధంగా ఉన్నాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ ఆ తర్వాత ‘అఖండ 2’ సైన్ చేసాను. ప్రతి కథలో కంటెంట్ నచ్చి, ఆడియన్స్ ఇష్టపడేలా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఫైనల్ గా ఆడియన్స్ కి నచ్చితే వెరీ హ్యాపీ” అన్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

‘అఖండ 2’లో తన క్యారెక్టర్ గురించి ఆమె మాట్లాడుతూ, “నా పాత్ర చాలా కీలకమైన సీక్వెన్స్‌లలో ఉంటుంది. స్టైలిష్‌గా ఉంటుంది. సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉంది, అది విన్నప్పుడు నిజంగా నెర్వస్ అయ్యాను. ఎందుకంటే ఇంత పెద్ద మాస్ సాంగ్ నేను ఇంతకు ముందు చేయలేదు. రెండు రోజుల ప్రాక్టీస్ తర్వాత నా మోకాలు సహకరించలేదు. ఫిజియోథెరపీ తీసుకున్న తర్వాత మాత్రమే పూర్తి చేయగలిగాను. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం నా ఫైనల్ గోల్” అని చెప్పారు. ఇక బాలయ్య గారితో పని చేసిన అనుభవాన్ని గురించి చెప్తూ, “బాలయ్య గారు చాలా ఫ్రెండ్లీ. మొదటిసారి యాడ్ షూట్ లో కలిసినప్పుడు ఎంతో పరిచయం ఉన్న మనిషిలా మాట్లాడారు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు, ఇది నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్. అదేవిధంగా, ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం చాలా పాషన్, అంకితభావంతో పనిచేస్తున్నారు. మొదటి సారి కలిసినప్పుడు క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి వెళ్ళమని కూడా సూచించారు” అని ఆమె పేర్కొన్నారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

అలాగే రామ్ గారు, గోపి గారు చాలా మంచి ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ గా ఉంటారు. ఇంత పెద్ద సినిమాని చేయడం నిర్మాతల సపోర్ట్ లేకపోతే సాధ్యం కాదు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తమన్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాయిని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు సినిమాని సెలెబ్రేట్ చేసుకునే విధానం అద్భుతం. వాళ్ళు ఫస్ట్ డేని సెలబ్రేట్ చేసుకునే విధానం చూస్తే మనం సక్సెస్ కి ఆడిట్ అయిపోతాం. ఇకపోతే ప్రస్తుతం ‘స్వయంభు’లో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే పూరి గారితో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు.