Nagabandham : ‘నాగబంధం’.. కేవలం క్లైమాక్స్ కోసం 20 కోట్లు!

Nagabandham
Nagabandham : యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’ భారీ అంచనాలు రేపుతోంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్, యాక్షన్, అద్భుతమైన విజువల్స్‌తో ఒక భారీ సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ షూటింగ్ జరగుతోంది. ప్రేక్షకులకు గొప్ప విజువల్ అనుభూతిని అందించడానికి కేవలం క్లైమాక్స్ కోసమే మేకర్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది పాన్-ఇండియా సినిమాల్లో ఇప్పటివరకు తెరకెక్కిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఓ మహా ద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా ప్రతిబింబించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే, థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను విజువల్‌గా మరింత గ్రాండ్‌గా మలుస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో సాగే ఈ కథ, శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ తిరుగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల నిధుల మిస్టరీల నుంచి ఈ కథ స్ఫూర్తి పొందింది. ఇక ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.