Sharwanand : ఇద్దరి మధ్య చిక్కుకున్న శర్వా… ఎంటర్‌టైనింగ్ టీజర్‌తో ‘నారి నారి నడుమ మురారి’

Nnnm teaser
చార్మింగ్ స్టార్ శర్వా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్‌బస్టర్ సామజవరగమన తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమా హ్యుమర్, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా సమ్మేళనంగా రూపొందింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగకు తగ్గట్లుగా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

కథ శర్వా పాత్ర చుట్టూ సాగుతుంది. ప్రేమించి పెళ్లికి సిద్ధమయ్యే సమయంలో అకస్మాత్తుగా మాజీ ప్రియురాలు తిరిగి రావడంతో అతని జీవితం గందరగోళంగా మారుతుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర నుంచి వచ్చే హాస్య ఘట్టాలు టీజర్ మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శర్వా తన కామిక్ టైమింగ్‌తో మెప్పించగా, సంయుక్త – సాక్షి వైద్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నరేష్, సత్య, సునీల్, సుదర్శన్‌ల కామెడీ సినిమాకు అదనపు బలం చేకూర్చింది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

సినిమాటోగ్రఫీ పరంగా జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ రిచ్ విజువల్స్ అందించగా, కేరళ బ్యాక్‌డ్రాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం కథనాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వా మాట్లాడుతూ, “ఈ సినిమా పొట్టపగిలి నవ్వేలా ఉంటుంది. జనవరి 14న సాయంత్రం 5:49 ఫస్ట్ షో నుంచి థియేటర్లలో విడుదల అవుతుంది” అని తెలిపారు. మొత్తంగా ‘నారి నారి నడుమ మురారి’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.