
న్యాచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైస్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓడెలా దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న సంగతి తెలిసిందే.
న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్‌ఫుల్, మెనేసింగ్ లుక్‌తో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. బలమైన శరీర నిర్మాణం, పొడవైన జడ జుట్టు, ఘనమైన గడ్డం, మడిచిన మీసాలతో నాని ఈ పాత్రలో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. రెడ్ టింటెడ్ గ్లాసెస్, భారీ మెటల్ చెయిన్‌లు, స్లీవ్‌లెస్ బ్లాక్ కాస్ట్యూమ్ ఈ లుక్‌కు మరింత రఫ్, రా ఇంటెన్సిటీని జోడిస్తున్నాయి. ఈ సీన్ విదేశీ ఫైటర్లతో జరిగే హై వోల్టేజ్ జైలు ఫైట్ సీక్వెన్స్‌కు చెందినదిగా సమాచారం. రగ్డ్ పాత్రల రూపకల్పనలో పేరున్న శ్రీకాంత్ ఓడెలా ఈ చిత్రాన్ని కూడా అదే గ్రిటీ టచ్‌తో తెరకెక్కిస్తున్నారని పోస్టర్ స్పష్టంగా చెబుతోంది.
ఈ చిత్రానికి సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ‘ది ప్యారడైస్’ మార్చి 26, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.









