Lahore 1947 : భారీ అంచనాల మధ్య ‘లాహోర్ 1947’ విడుదల తేదీ ఫిక్స్

Lahore1947
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న పీరియడ్ డ్రామా చిత్రం **‘లాహోర్ 1947’**ను 2026 ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవ వారంలో విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాతో తొలిసారిగా సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి, నిర్మాత ఆమిర్ ఖాన్ కలిసి పనిచేస్తున్నారు.

Also Read :  Killer Movie Accident: 'కిల్లర్' షూటింగ్‌లో ఘోరం.. బిన్నీ మిల్స్ పేలుడులో ఒకరు మృతి!

ఈ చిత్రంలో సన్నీ డియోల్‌తో పాటు శబానా ఆజ్మీ, ప్రీతి జింటా, అభిమన్యు సింగ్, కరణ్ డియోల్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంగీతం ఏ.ఆర్. రెహమాన్, పాటల రచన జావేద్ అఖ్తర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సంతోష్ శివన్ నిర్వహిస్తున్నారు. ఇటీవల వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న సన్నీ డియోల్‌కు ఇది మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.