Bloody Romeo : ‘బ్లడీ రోమియో’గా నాని.. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ ఎంట్రీ!

Bloody romeo
Bloody Romeo : వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న నాని తన 34వ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల OGతో భారీ విజయాన్ని అందుకున్న సుజీత్‌తో నానికి ఇది తొలి సినిమా కావడం విశేషం. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అయితే సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

గ్లింప్స్‌లో నాని ఒక చెఫ్‌గా కిచెన్‌లో కనిపిస్తాడు. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్‌తో “చిటికెడు కరుణ, పిడికెడు కోపం” అంటూ చెప్పే మాటలు సాధారణ రెసిపీలా అనిపించినా, అవి అతని హింసాత్మక వ్యక్తిత్వానికి సంకేతాలుగా మారుతాయి. సాధారణంగా కనిపించే ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా టైమ్ బాంబ్‌లా పేలిపోవడం ద్వారా “గ్యాంగ్‌స్టర్’స్ డెన్”ను ధ్వంసం చేయడం ఈ కాన్సెప్ట్‌కి క్లైమాక్స్‌గా నిలిచింది. “No.1 Chef” నుంచి “No.1 Gangster”గా మారే రివీల్ ఆసక్తిని రెట్టింపు చేసింది. చివర్లో లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సిగార్ వెలిగించే నాని షాట్ అతని స్టైలిష్, డేంజరస్ పర్సోనాను ఎలివేట్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం