Peddhi Movie Budget: “పెద్ది” బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

Peddi telugu movie review

Peddhi Movie Budget: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండగా, సినిమా బడ్జెట్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం కేవలం నటీనటులు, టెక్నికల్ టీమ్ రెమ్యూనిరేషన్ల కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్, ఇతర నటీనటులతో పాటు దర్శకుడు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు అన్ని కలిపి దాదాపు రూ. 170 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అంటే సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం వాటా (రూ. 170 కోట్లు) కేవలం క్యాస్టింగ్ – క్రూ రెమ్యూనిరేషన్లకే సరిపోయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదేమైనా థియేటర్లలో ‘పెద్ది’ సృష్టిస్తున్న వసూళ్ల విధ్వంసం చూస్తుంటే, నిర్మాతలు పెట్టిన ప్రతి పైసాకు పర్ఫెక్ట్ రిటర్న్స్ వస్తున్నాయని అంటున్నారు.