Vijay Deverakonda: రౌడీ హీరోతో – విక్రమ్ కె. కుమార్ కాంబో ఫిక్సా?

Vijay Deverakonda

Vijay Deverakonda: టాలీవుడ్ యాంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచారు. వరుసగా క్రేజీ డైరెక్టర్లతో లైన్ అప్ సెట్ చేసుకుంటున్న ఈ రౌడీ హీరో.. త్వరలోనే మరో విలక్షణ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘మనం’, ’24’ వంటి క్లాసిక్ చిత్రాల డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) తో విజయ్ దేవరకొండ సరికొత్త సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబోపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్’ (Maddock Films) ఆఫీస్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్‌లో వరుస హిట్స్ ఇస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్‌లో విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ ప్రొడక్షన్ మెంబర్స్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదొక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం.

Also Read :  Seyon: శివకార్తికేయన్ 'సేయోన్' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. సినిమా రిలీజ్ అప్పుడే!

‘ఇష్క్’, ‘మనం’, ‘24’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి డిఫరెంట్ జానర్స్‌తో, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం విక్రమ్ కె. కుమార్ స్టైల్. అలాంటి క్లాస్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్.. విజయ్ దేవరకొండ లాంటి మాస్ అండ్ ఎనర్జిటిక్ హీరోను స్క్రీన్‌పై ఎలా చూపిస్తారో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో స్కై హైకి చేరింది. విక్రమ్ మార్క్ సరికొత్త లవ్ స్టోరీ లేదా మైండ్ బెండింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ – విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇంకా అధికారిక ప్రకటన కూడా రాకముందే ఈ కాంబోపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.