Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార క్యూట్ పిక్ షేర్ చేసిన ఉపాసన.. నెట్టింట వైరల్!

Klin Kaara

Klin Kaara: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతుల ముద్దుల కుమార్తె, మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార కొణిదెల’ నేడు (జూన్ 20) మూడో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ స్పెషల్ డే సందర్భంగా ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్ – ఉపాసనలతో కలిసి క్లీంకార ఉన్న ఒక క్యూట్ అండ్ లవ్లీ ఫోటోను ఆమె షేర్ చేశారు.

Also Read :  divyendu sharma: వెంకీ - త్రివిక్రమ్ ‘AK47’ లోకి రామ్‌బుజ్జి!

సాధారణంగా క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించేలా ఫోటోలను మెగా ఫ్యామిలీ చాలా అరుదుగా షేర్ చేస్తుంటుంది. అయితే నేడు క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా చరణ్ – ఉపాసనలు తమ చిన్నారిని ఎంతో అపురూపంగా ఎత్తుకుని ఉన్న ఈ ఫోటోను పంచుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ లవ్లీ ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. క్లీంకార బర్త్‌డే పిక్ చూసిన మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ లిటిల్ ప్రిన్సెస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. లలితా సహస్రనామం నుంచి తీసుకున్న ఈ పేరుకు ‘ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిల్చే పవిత్రమైన శక్తి’ అనే అర్థం వస్తుంది.