Baahubali : ‘బాహుబలి’ అసలు రహస్యాలు బయటపెడుతున్న నెట్‌ఫ్లిక్స్!

Baahubali

Baahubali : జక్కన్న సృష్టించిన అద్భుతం ‘బాహుబలి’ (Baahubali). ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రను ‘బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత’ అని మార్చేలా సంచలనం సృష్టించిందంటు అతిశయోక్తి కాదు. ఈ సినిమా తెర వెనుక విశేషాలు, ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాను ఎలా ప్రభావితం చేసిందనే అంశాలపై ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక ఆకస్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read :  Lenin: అఖిల్ ‘లెనిన్’లో మెగా వాయిస్ ఓవర్.. చిరంజీవి మాటలతోనే సినిమా షురూ?

‘బాహుబలి – ది టార్చ్ బేరర్’ (#Baahubali – THE TORCH BEARER) పేరుతో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ వారం శుక్రవారం నుంచి గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీలో బాహుబలి సినిమాను రాజమౌళి ఎలా ప్లాన్ చేశారు? ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ కోసం పడ్డ కష్టం, ఆర్ట్ డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ప్రొడక్షన్ వెనుక ఉన్న అసలు రహస్యాలను ప్రపంచానికి చూపించబోతున్నారు. ఇండియన్ సినిమాకు ఒక ‘టార్చ్ బేరర్’ లా నిలిచిన ఈ మాస్టర్ పీస్ మేకింగ్ విజువల్స్, బిహైండ్ ది సీన్స్ చూడటానికి సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.