SS Rajamouli: విజువల్స్ నెక్స్ట్ లెవెల్.. కానీ మహేష్ ‘వారణాసి’ అసలైన కథ అదే: రాజమౌళి

Varanasi

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమాకు సంబంధించి జక్కన్న పంచుకున్న కొన్ని సరికొత్త విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమా కేవలం ఒక ప్రాంతానికో, కాలానికో పరిమితం కాదని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి స్పష్టం చేశారు. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సరికొత్త లోకాల్లోకి ఈ చిత్రం తీసుకెళ్లనుందని స్పష్టం చేశారు.

Also Read :  Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార క్యూట్ పిక్ షేర్ చేసిన ఉపాసన.. నెట్టింట వైరల్!

ఆఫ్రికాలోని దట్టమైన వన్యప్రాంతాల సాహసాలు, గడ్డకట్టే అంటార్కిటికా మంచు అందాలు, సవాళ్లు, భారతీయ పురాణ వైభవాన్ని చాటేలా రామాయణ కాలానికి సంబంధించిన దైవిక అంశాలు, మునుపెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్, భారీ ప్రకృతి వైపరీత్యాలు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో భాగం కానున్నాయని చెప్పుకొచ్చారు. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నా, విజువల్స్ ఎంత భారీగా ఉన్నా.. ‘తండ్రీ-కొడుకుల అనుబంధం’ మాత్రమే ఈ సినిమాకు అసలైన ఎమోషనల్ కోర్ అని రాజమౌళి నొక్కి చెప్పారు. హృదయాలను కదిలించే ఈ బలమైన భావోద్వేగమే లార్జర్-దన్-లైఫ్ విజువల్స్‌కు అసలైన బలాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Also Read :  Sukumar: ‘రావు బహదూర్’పై సుకుమార్ సెన్సేషనల్ రివ్యూ!

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ ఐమాక్స్ యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.