Jr NTR: అఖిల్ ‘లెనిన్’ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న తారక్.. థియేటర్లలో గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Akhil Lenin

Jr NTR: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. జూలై 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్‌కు మైండ్ బ్లాయింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాకు గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ అందించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ వాయిస్ తోడవడంతో సినిమాకు బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా కొండంత బలం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేటర్లలో సినిమా మొదలైన మొదటి నిమిషంలోనే ఎన్టీఆర్ వాయిస్ వినపడగానే ఆడియన్స్‌కు కచ్చితంగా గూస్‌బంప్స్ వస్తాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఒక విలక్షణమైన యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రారంభంలో వచ్చే అత్యంత కీలకమైన ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే సరికొత్త బ్యాక్‌డ్రాప్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. తన ప్రత్యేకమైన, గంభీరమైన బేస్ వాయిస్‌తో తారక్ ఈ చిత్రానికి నేరేషన్ ఇవ్వడం విశేషం. పరిచయం అక్కర్లేని ఆ సింహ గర్జన లాంటి వాయిస్‌తోనే ‘లెనిన్’ ప్రపంచం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, కింగ్ నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.