AA23 Buzz: హైదరాబాద్-చెన్నైలో జోరుగా ప్రీ-ప్రొడక్షన్.. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే?

Cinema

AA23 Buzz: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #AA23పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అధికారిక ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. AA23 ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయట. ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ల బృందాన్ని రెండు టీంలుగా విభజించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక బృందం హైదరాబాద్‌లో పని చేస్తుండగా, మరో బృందం చెన్నైలో సినిమా ప్రీ-ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తోందని సమాచారం.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో అల్లు అర్జున్-పూజా హెగ్డే జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించే అవకాశముందనే వార్తలు బన్నీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల అల్లు అర్జున్, పూజా హెగ్డేలపై ప్రత్యేక ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఫోటోషూట్ సినిమా ప్రమోషన్ల కోసమా, లేక లుక్ టెస్ట్ కోసమా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో బన్నీ అభిమానులు మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించనున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పాన్ ఇండియా లెవల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.