Donga Naa Koduku: మౌళీ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్.. ‘దొంగ నా కొడుకు’గా యంగ్ హీరో!

Donga Naa Koduku

Donga Naa Koduku: యువ హీరో మౌళీ ‘90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “Beware… Donga Naa Koduku is here to steal a few laughs” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. ఈ సినిమా పూర్తి స్థాయి రాబరీ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు వెల్లడించింది.

దొంగతనం నేపథ్యంలో సాగే కథకు హిలేరియస్ కామెడీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో మౌళీ సరసన సుష్మిత (సుష్షీ) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాకు సంబంధించిన కథ, దర్శకత్వ బాధ్యతలను ‘దొంగ నా కొడుకు’ పేరుతోనే గుర్తింపు పొందిన దర్శకుడు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సిన్జిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు.