నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ .. ఊర మాస్ అవతార్‌లో న్యాచురల్ స్టార్!

The Paradise

The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ విడుదలైన క్షణాల నుంచే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీజర్‌లో నాని ఇప్పటివరకు చూడని రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో నాని పాత్రకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకమైన మాస్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.

“ఇక నుంచి ఈ జాగ మనదే.. ఈ దేశమే మనదే” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు సామాజిక అంశాలను ప్రతిబింబించే సంభాషణలు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక ప్రత్యేకమైన టోన్ కనిపించగా, నాని పాత్రలోని ఊర మాస్ యాంగిల్‌ను శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి నాని మరింత వైలెంట్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.