Prabhas: ‘ఫౌజీ’ తర్వాత ప్రభాస్‌ – హను రాఘవపూడి కాంబో రిపీట్‌? హోంబలే ఫిలింస్‌తో మరో మూవీకి డార్లింగ్ ప్లాన్‌!

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రభాస్‌, హను రాఘవపూడి మధ్య క్రియేటివ్‌ బాండింగ్‌ మరింత బలపడినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కూడా వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఫౌజీ’ షూటింగ్‌ విషయంలో హను రాఘవపూడి వర్కింగ్‌ స్టైల్‌, కథను తెరకెక్కిస్తున్న విధానం ప్రభాస్‌ను ఎంతగానో ఆకట్టుకున్నట్లు సమాచారం. ఇతర ప్రాజెక్టుల షూటింగ్‌లలో బిజీగా ఉన్న సమయంలోనూ హను పనితీరును ప్రభాస్‌ ప్రశంసిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’ తర్వాత కూడా ఈ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఆలోచన ఇద్దరి మధ్య వచ్చినట్లు గాసిప్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం ‘ఫౌజీ’ పూర్తయ్యే దిశగా సాగుతుండగా.. సినిమా తర్వాత హను రాఘవపూడితో మరో కథ చేయడానికి ప్రభాస్‌ ఆసక్తి చూపుతున్నట్లు టాక్‌. ఈసారి ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ‘ఫౌజీ’ స్టోరీకి సంబంధించి ప్రీక్వెల్‌ ఆలోచన కూడా భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కథా ప్రపంచం, పాత్రలకు ఉన్న స్కోప్‌ను బట్టి ప్రీక్వెల్‌ చేసే అవకాశం ఉందని టాక్‌. ప్రభాస్‌-హను కాంబినేషన్‌లో ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ హైప్‌ నెలకొంది. ఈ సినిమా తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తారనే వార్త నిజమైతే.. అభిమానులకు అది మరింత క్రేజీ కాంబినేషన్‌గా మారనుంది. అయితే ప్రీక్వెల్‌, తదుపరి సినిమా వంటి అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఫౌజీ సినిమా డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.