
Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలన కలెక్షన్స్‌ను నమోదు చేస్తుందో తెలిసిందే. ఇప్పుడు అందరి చూపు డైరెక్టర్ శివ నిర్వాణ మీదే ఉంది. ఇంత సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో ఆసక్తి్కరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి ‘ఇరుముడి’ కంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ ప్రయాణం మొదలైనట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ధనుష్‌తో శివ నిర్వాణ చేయబోయే సినిమా విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ‘ఇరుముడి’ లాంటి ఘన విజయం అందుకున్న తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించబోయే చిత్రంగా ప్రచారంలో ఉంటడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇప్పుడు ధనుష్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో శివ ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.













