Site icon TeluguMirchi.com

Heroine : సుశాంత్ సూసైడ్ ఫ్లాట్‌లో అద్దెకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Adah sharma

Heroine : ఈ మధ్య కాలంలో ఒకే ఒక్క హిట్‌తో స్టార్ డమ్‌ను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. సినిమాలు రిలీజ్ అయిన అర్ధరాత్రి నుంచే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఓవర్నైట్ ట్రాన్సఫార్మేషన్ చూస్తున్నాం. అలా స్టార్ అయిన హీరోయిన్లలో ఓ పేరు.. అదా శర్మ. అందంతోనే కాదు.. అభినయంతోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం? ఆమె ‘అదా’గానే కాదు.. ‘అద్దె’గానే ఉండడం!

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.400 కోట్లు వసూల్ చేసి, భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. విమర్శకులు కూడా ఆమె నటనను తెగ మెచ్చుకున్నారు. అయినా ఇప్పటికీ ఆమె సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లోనే ఉంటోంది.

అయితే ఇది ఒక షాక్ లా అనిపించవచ్చు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోయిన్లు హిట్ వచ్చిందంటే లగ్జరీ ఫ్లాట్లు కొనేస్తారు. కానీ అదా మాత్రం అలా కాదు. ఇంత భారీ హిట్ వచ్చినా ఆమె మాత్రం అద్దె ఇంట్లోనే కొనసాగుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… అదా శర్మ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివాసంగా ఉండిన ఫ్లాట్ లోనే అద్దెకు దిగింది. అదే అపార్ట్‌మెంట్, అదే ఫ్లాట్ – అక్కడే 2020లో సుశాంత్ చనిపోయాడు. ఆ ఇంట్లోకి ఏవ్వరూ వెళ్లడానికి సిద్ధపడలేదు. కానీ అదా మాత్రం ధైర్యంగా ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది. నెలనెలా రెంటు చెల్లిస్తూ అక్కడే నివాసముంటోంది.

అదా శర్మ జీవనశైలి చూస్తే… ఇది ఒక అందమైన గమ్యం కాదు. అది ఒక ప్రయాణం అని చెప్పొచ్చు. ఆమెకు ఆస్తులంటే మక్కువ లేదు, బదులుగా రోల్స్, చక్కటి కథలంటే అభిమానం ఉంది. అందుకే ‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ, తొలి సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోయినా, బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఓ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని నడిపించాలన్న అదా శర్మ ఆలోచనకు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విశేషంగా పెరుగుతోంది. గ్లామర్ చూపించడంలో దిట్ట అయినా… ఆమె అసలైన బలమే నటన. ఆ బలం గానే ఆమె చాలా దూరం వెళ్లింది.

Exit mobile version