
Akhanda 2 : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా హైదరాబాదులో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాసివ్ తాండవం టీజర్ విడుదల చేయడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
‘భారత్ ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డంపెట్టుకునే కొట్టాలి’అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ‘కొండల్లో తొండలు తిని బ్రతికే మీరెక్కడ.. ప్రతీ కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ’ అంటూ బాలయ్య రుద్ర తాండవం చేశాడు. గదతో శత్రువులను ఒకేసారి కొట్టడం ఆ వెనుకే హనుమంతుడి దివ్యరూపం ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తమన్ మ్యూజిక్, బాలయ్య యాక్షన్‌తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. దర్శకుడు బోయపాటి శ్రీను తన మైథో-యాక్షన్ శైలిని ఈసారి అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. జాతీయ భద్రత, ఆధ్యాత్మిక యుద్ధం కలిసిన ఈ కథ పాన్-ఇండియా స్థాయిలో ప్రభావం చూపేలా ఉంది. ఇక హర్షాలి మల్హోత్రా బాలకృష్ణ కూతురు పాత్రలో కనిపిస్తుండగా, సమ్యుక్త హీరోయిన్‌గా, ఆది పినిశెట్టీ శక్తిమంతమైన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

