Akhanda Effect : అఖండ ఆగమనంతో మారిన సినిమా రిలీజ్ డేట్లు !

Akhanda effect
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 ఎన్నో వాయిదాల తర్వాత చివరకు డిసెంబర్ 12న థియేటర్లలోకి వస్తోంది. ఈ భారీ సినిమా విడుదల తేదీ ఫిక్స్ కావడంతో, ఇతర చిత్రాల రిలీజ్ షెడ్యూల్‌ కూడా పూర్తిగా మారిపోయింది. అఖండ 2 లాంటి మాస్ అట్రాక్షన్ సినిమా లైన్లోకి రావడంతో చిన్న–మధ్య తరహా సినిమాలు తమ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది.

సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ అసలుగా డిసెంబర్ 12కి ప్లాన్ చేయగా, తాజా అప్‌డేట్ ప్రకారం అది ఒక రోజు వాయిదా పడి డిసెంబర్ 13న విడుదల కానుంది. మరోవైపు, కార్తి నటించిన వా వాథియార్/అన్నగారు వస్తారు మాత్రం ప్రకటించినట్లే డిసెంబర్ 12నే థియేటర్లలోకి వస్తోంది. దీంతో కార్తి సినిమా, అఖండ 2తో నేరుగా బరిలోకి దిగనుంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

హెబా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ఈషా కూడా ముందుగా డిసెంబర్ 12 విడుదలకు సిద్ధం కాగా, ఇప్పుడు అది డిసెంబర్ 25కి మారింది. ఇదే సమయంలో, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ ఈ వారాంతంలో విడుదల కావాల్సి ఉన్నా, తాజా షెడ్యూల్ ప్రకారం అది జనవరి 1కు మార్చబడింది. మొత్తంగా, అఖండ 2 ఎంట్రీతో డిసెంబర్ రిలీజ్ కాలెండర్‌లో పూర్తిగా మార్పులు చోటుచేసుకున్నాయి.