అమ్మవారి రూపంలో అల్లు అర్జున్..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రేపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పుష్ప ఎక్కడ అనే స్పెషల్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక ఇక్కడితో ఆగకుండా ఒక అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసి డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇక ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ చీర కట్టి అమ్మవారి అవతారంలో ఫుల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. అయితే ఈ పోస్టర్ రేపు రిలీజ్ చేయాల్సి ఉండగా.. అప్పటికే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అధికారికంగా ప్రకటించారట. ఇక పోస్టర్ లో బన్నీ చీరతో, ఒంటినిండా నగలతో, ఒకచేత్తో గన్ తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మొత్తంగా పుష్ప 2 ఒక్కసారిగా అందరిలో విపరీతంగా అంచనాలు పెంచేసింది.