Andhra King Taluka : హైప్స్ పెంచుతున్న రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ – సెన్సార్ రిపోర్ట్స్ పాజిటివ్

Akt1
Andhra King Taluka : ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నవంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. అలాగే సినిమా రన్‌టైమ్‌ను సుమారు 2 గంటలు 40 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఇక పాటలు, టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషన్లు ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా 90వ దశకంలో ఉండే ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్‌ను గుర్తు చేసే మాస్స్ కల్చర్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడంలో ఈ సినిమా విజయవంతం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

సినిమాలో రామ్ పాత్రను సినిమా పిచ్చితో, స్టార్ హీరో అభిమానంతో పెరిగే యువకుడిగా చూపించారు. రామ్–భాగ్యశ్రీ జంట రొమాంటిక్ ఎలిమెంట్‌ను అందించగా, రామ్–రావు రమేశ్ మధ్య సన్నివేశాలు మంచి కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకోనున్నాయి. సూపర్‌స్టార్ సూర్యగా ఉపేంద్ర కనిపించే ప్రతి సన్నివేశం సినిమాకు ఎలివేషన్, డెప్త్ రెండింటినీ తీసుకురానుందట.

వైవేక్–మెర్విన్ సంగీతం ఆల్బమ్‌ను ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా మార్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఎపిసోడ్‌లు, టెంపుల్ సీన్ సినిమా హైలైట్స్‌గా నిలుస్తాయని టాక్. దర్శకుడు మహేష్ బాబు పి. యొక్క స్టోరీటెల్లింగ్ స్టైల్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు కలిసి మాస్, నాస్టాల్జియా, ఎమోషన్‌లకు సమతౌల్యం తీసుకురానున్నాయి. ముఖ్యంగా చివరి 30–40 నిమిషాలు సినిమాకు కీలక భాగమని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తం మీద ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రామ్ కెరీర్‌లో అత్యంత ప్రామిసింగ్ కమర్షియల్ సినిమాల్లో ఒకటిగా మారనున్నట్లు కనిపిస్తోంది.