Andhra King Thaluka : లవ్ సాంగ్ అదరహో… ట్రెండ్‌లో నువ్వుంటే చాలే

Nuvvunte chale
Andhra King Thaluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే యూనిక్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ “నువ్వుంటే చాలే” విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే – రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ప్రేమకు అర్థం చెప్పేలా, అనుభూతిని స్పష్టంగా వ్యక్తపరిచేలా ఉండే ఈ సాహిత్యం సంగీత ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ వోకల్స్, హార్ట్ టచింగ్ మ్యూజిక్ తో కలసి పాటను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్, లక్షల లైక్స్ రాబట్టిన ఈ పాట, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ పాటలో రామ్ – భాగ్యశ్రీ జంట చూడముచ్చటగా కనిపిస్తుండగా, వారి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ పాటను రైనీ సీజన్‌లో పర్‌ఫెక్ట్ లవ్ సాంగ్ అంటూ మ్యూజిక్ లవర్స్ ప్రశంసిస్తున్నారు. ఫస్ట్ టైమ్ లిరిక్ రైటర్‌గా మారిన రామ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే, రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ సాంగ్‌తోనే సినిమాపై బజ్ పెరిగిపోగా, “నువ్వుంటే చాలే” పాట రొమాంటిక్ & లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడం ఖాయం అంటున్నారు సినీప్రేక్షకులు.