‘గుంటూరు కారం’ నుంచి మరో మాస్ పోస్టర్ విడుదల.. ఫ్యాన్స్ కి పండగే


సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక & హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సూపర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే నేడు(ఆగష్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. నిన్న రాత్రి రిలీజైన సూపర్ మాస్ పోస్టర్ లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా మరో స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా తో ప్రత్యర్థుల తో తలపడుతున్నట్లుగా మహేష్ కనిపిస్తున్న వైనం కట్టిపడేస్తోంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే గుంటూరు కారం షూటింగ్‌ను ఆగస్టు ద్వితీయార్థంలో పునఃప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.