TB Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ముద్దుగా నవ్వుతూ నిలబడిన ఆ పాప ఫోటో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు – “ఈ పాపేనా ఇప్పుడు అందర్నీ మాయలో పడేసిన గ్లామర్ క్వీన్?” అని. అవును.. ఆ చిన్నారి మరెవరో కాదు – సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అనుపమ పరమేశ్వరన్! చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ కావడంతో, ఆమె అభిమానులు మత్తెక్కిపోయారు. టీనేజ్ లోనే వెండితెరకి పరిచయమై, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస విజయాలతో దూసుకెళ్లిన ముద్దుగుమ్మ అనుపమ.
త్రిస్సూర్ జిల్లాలో జన్మించిన అనుపమకు చిన్ననాటి నుంచి నటనపై మక్కువ. ఆ మక్కువే ఆమెను ‘ప్రేమమ్’ సినిమాలోకి తీసుకెళ్లింది. అచ్చం కాలేజీ అమ్మాయిలా కనిపించి.. అందరి మనసులు దోచేసింది. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో భారీ అవకాశాలు వచ్చాయి. ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
ఇప్పటివరకు హోమ్లీ పాత్రల్లో కనిపించిన అనుపమ… ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో గ్లామర్ అవతారమెత్తింది. ఆమె లుక్స్ చూసి కుర్రాళ్లు మెంటలవుతున్నారు. ఈ సినిమాతో పాటు అనుపమకు ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.
ఇప్పుడు అనుపమ ఒక్కో సినిమా కోసం రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు వరకూ డిమాండ్ చేస్తుందట. టిల్లు స్క్వేర్ విజయం తర్వాత ఆమె పారితోషికం పెంచిందని టాక్. ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం, అనుపమ పరమేశ్వరన్‌కు దాదాపు రూ.33 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
















