సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించిన ‘బేబి’..


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన తాజా చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే పాటలు, ట్రైలర్ తో బేబీ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక తొలి షో నుంచి ‘బేబి’ మూవీకి పాటిజివ్ టాక్‍ రావటంతో హౌస్‍ఫుల్ షోలు పడ్డాయి దీంతో ఈ సినిమా తొలి రోజే సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు చిత్రయూనిట్ తెలిపింది. అయితే చిన్న సినిమాగా వచ్చిన బేబికి ఈస్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా బేబీ నిలిచిపోనుంది. అంతేకాదు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‍గా ఉంది. ఇక ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు.