Badass First Look: ఈసారి మరింత బోల్డ్ గా.. సిద్ధు జొన్నలగడ్డ కొత్త అవతారం!

Badass
Badass

Badass First Look: ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ, మరోసారి విభిన్నమైన కథతో రాబోతున్నారు. దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘బ్యాడాస్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టైటిల్‌కు తగ్గట్టే, ఫస్ట్ లుక్‌ లోని “If middle finger was a man” అనే బోల్డ్ డైలాగ్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ చిత్రానికి కథను దర్శకుడితో కలిసి సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా అందించడమే కాకుండా, పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ‘టిల్లు’ సినిమాల ద్వారా తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించిన సిద్ధు, ఈసారి గంభీరమైన నటనతో అలరించబోతున్నారు. నిర్మాణంలో భాగంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధుతో కలిసి వస్తున్న ముచ్చటగా మూడో సినిమా కావడం విశేషం. 2026లో విడుదలకు సన్నద్ధమవుతున్న ఈ సినిమా, టాలీవుడ్‌లో మరో రివల్యూషన్‌ అయే అవకాశముంది.