Site icon TeluguMirchi.com

NBK Mokshagnya combination: కొడుకు ఎంట్రీలో బాలయ్య ఊచకోత.. మోక్షజ్ఞ డెబ్యూలో 40 నిమిషాల విధ్వంసం.. ఆ రోల్ మామూలుగా ఉండదంటా!

Balakrishna

Balakrishna

NBK Mokshagnya combination: నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రంపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా, తాజాగా బయటకు వచ్చిన ఒక సంచలన వార్త బాక్సాఫీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొడుకు తొలి సినిమాను ఏదో నామమాత్రంగా కాకుండా, వెండితెరపై నభూతో నభవిష్యతి అనేలా ప్లాన్ చేస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ డెబ్యూ చిత్రంలో బాలయ్య కేవలం తెర వెనుక మార్గదర్శిగా మాత్రమే ఉండటం లేదు.. స్వయంగా రంగంలోకి దిగి సిల్వర్ స్క్రీన్‌పై విశ్వరూపం చూపించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ చిత్రంలో బాలకృష్ణ దాదాపు 40 నిమిషాల పాటు సాగే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఏదో వచ్చిపోయే క్యామియోనో, అభిమానులను అలరించేందుకు పెట్టే గెస్ట్ రోలో లేదా స్పెషల్ సాంగో కానే కాదు. కథను మలుపు తిప్పే కీలకమైన బ్యాక్‌బోన్ లాంటి క్యారెక్టర్. గతంలో చిరంజీవి ‘ఆచార్య’లో రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్ర తరహాలో, అలాగే వెంకటేశ్ ‘శంకరవరప్రసాద్’లో కనిపించిన పవర్‌ఫుల్ రోల్ లాగా.. ఈ సినిమాలో బాలయ్య పాత్ర కథాగమనానికి అత్యంత ప్రధానమైనదిగా ఉండబోతోందట. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ 40 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో నందమూరి సింహాలు రెండూ కనిపిస్తే థియేటర్లలో రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఈ క్రేజీ అప్‌డేట్‌తో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ అద్భుత కలయిక వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

Exit mobile version