NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ పోస్ట్!

Balakrishna Fans

NBK 111: నందమూరి బాలకృష్ణ – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #NBK111. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన ఒక డిఫరెంట్ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణను ఆయన రెగ్యులర్ క్లాసిక్ మాస్ స్టైల్‌కు పూర్తి భిన్నంగా.. మునుపెన్నడూ చూడని రేంజ్‌లో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సరికొత్త మోడరన్ అవతార్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోందని అర్ధమవుతోంది.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ హై-వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో అదిరిపోయే స్టంట్స్, ఊహించని రేంజ్ యాక్షన్ ఎపిసోడ్లను ఈ షెడ్యూల్‌లో మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, సరికొత్త మేకింగ్ స్టైల్‌తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2027లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్, అరవింద్ కాశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తుండడం ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి.. జూన్ 10న ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ రాబోతోందని డైరెక్టర్ తన పోస్ట్‌లో వెల్లడించారు. ఆ రోజున ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ఎలా ఉండబోతుందా అని నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న రెండవ చిత్రం కావడంతో దీనిపై ఈ ప్రాజెక్ట్‌పై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.