Balakrishna – Prabhas: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన బాలయ్య? బాక్సాఫీస్ వద్ద క్రేజీ ట్విస్ట్!

Balakrishna Prabhas

Balakrishna – Prabhas: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై తాజాగా సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బాక్సాఫీస్ క్లాష్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘Fauzi’ డిసెంబర్ 3న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ ఏర్పడే అవకాశం ఉందని మేకర్స్ భావించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ‘NBK111’ రిలీజ్‌ను క్రిస్మస్ సీజన్‌కు మార్చాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య సినిమాను అప్పుడు విడుదల చేస్తే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, దసరా నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే విడుదల తేదీ మార్పుపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.