‘బ్రో’.. మార్కండేయ వచ్చేది రేపే !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్ కు మాసివ్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

‘బ్రో’ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ‘మై డియర్ మార్కండేయ..’ ను రేపు(జూలై 8) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఈ పోస్టర్ లో మామ, అల్లుళ్ళ లుక్ అదిరింది. ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా ఒకరిని మించే విధంగా ఒకరు ఉన్నారు. ఇక ఈసినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.