‘బ్రో’ టీజర్ డేట్ & టైం ఫిక్స్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘బ్రో’. త‌మిళ హిట్ ఫిల్మ్ ‘వినోదాయ సితం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే గత రెండు రోజులుగా ‘బ్రో’ టీజర్‌ అప్‌డేట్‌ అంటూ టీమ్‌ హడావుడి చేస్తూనే ఉంది. తాజాగా ఎట్టకేలకు ‘బ్రో’ టీజర్‌ విడుదల టైమ్‌ని ప్రకటించింది చిత్రయూనిట్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

పవన్ కళ్యాణ్ తన డబ్బింగ్ ని పూర్తి చేయడంతో, రేపు (గురువారం) సాయంత్రం ఐదు గంటల నాలుగు(5.04) నిమిషాలకు `బ్రో` టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు కొత్త పోస్టర్‌ని విడుదల చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో ‘బ్రో’ టీజర్‌కి టైమ్‌ స్టార్ట్ అంటూ చిటికే వేసినట్టుగా లుక్‌ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుంతుంది. ఇకపోతే ఈసినిమా జూలై 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.