Buchi Babu: ‘పెద్ది’ హీరోయిన్ పాత్రపై ట్రోల్స్.. దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్!

Buchi Babu

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఒకవైపు కలెక్షన్ల వర్షం కురుస్తున్నా.. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నెగెటివిటీపై ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన రెండో చిత్రం ‘పెద్ది’. రస్టిక్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం, ప్రజెంటేషన్ సరిగా లేదంటూ కొందరు ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బుచ్చిబాబు.. తాను ఈ స్థాయిలో నెగెటివిటీ వస్తుందని అస్సలు ఊహించలేదని ఓపెన్ అయ్యారు.

Also Read :  Peddi OTT Partner: అఫీషియల్.. ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరోయిన్ పాత్రపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. “సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక ఆటపట్టించే పల్లెటూరి రొమాంటిక్ ట్రాక్‌ను చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. ‘పెద్ది’ అనేది ఒక రస్టిక్ హై-ఎనర్జీ డ్రామా. ఆ కథాంశం, సినిమా మూడ్‌కు తగినట్లుగానే జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేశాం. అంతేకాని ఏ ఒక్కరినీ తక్కువ చేసి చూపించాలనే ఆలోచన మాకు అస్సలు లేదు” అని బుచ్చిబాబు స్పష్టం చేశారు. “ఇది దర్శకుడిగా నా రెండో సినిమా మాత్రమే. ‘పెద్ది’ హీరోయిన్ పాత్ర విషయంలో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరిస్తున్నాను. నా రాబోయే చిత్రాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, వారి పాత్రల రూపకల్పన విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను” అని స్పష్టం చేశారు. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుంటూ, తన నెక్ట్స్ సినిమాల్లో ఈ తప్పులు సరిదిద్దుకుంటానని బుచ్చిబాబు బోల్డ్‌గా సమాధానం చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.