‘స్కంద’ నుంచి కల్ట్ మామా సాంగ్.. ఎప్పుడంటే ?


బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’-ది ఎటాకర్‌ ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్‌లలో చూపించగా, సెకండ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ లో రామ్ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌ లో కనిపించగా.. సెప్టెంబర్ 18న విడుదల కానున్న నాల్గవ పాట కల్ట్ మామాలో అద్భుతమైన డ్యాన్స్ లతో అలరించబోతున్నాడు. ఇక ఈ పాటలో ఊర్వశి రౌతేలా కూడా సందడి చేయనున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

పాట అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రామ్ మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్, మ్యాసీ అవతార్‌లో కనిపించారు. ఇక ఊర్వశి రౌతేలా అయితే మెరిసే దుస్తులలో సూపర్-హాట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు అసాధారణమైన మేకప్‌తో భయపెడుతున్నారు. కల్ట్ మామా, అతని కల్ట్ మానియాను చూడటానికి మనం మరో రెండు రోజులు వేచి ఉండాలి.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌కు ఎక్స్ పెన్సీవ్ మూవీ. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్కంద సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.