Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

Buchi Babu Sana

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ జూన్ 4వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు చూపిస్తున్న అంకితభావం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”ఈ రోజు మా మ్యారేజ్ డే .. కానీ ఆ సంగతి కూడా మైండ్‌లో లేనంతగా పెద్ది సినిమా మునిగిపోయాను. గత మూడు రోజులుగా అసలు క్యాలెండర్ వైపు కూడా చూసే తీరిక దొరకలేదు. కంటిమీద కునుకు లేకుండా కేవలం ‘పెద్ది’ ప్రచార పనులు, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లోనే బిజీగా ఉన్నాను” అని వివరించారు. ఒక డైరెక్టర్‌కు తన క్రియేషన్ మీద ఉన్న మక్కువకు, నిబద్ధతకు ఈ సంఘటనే మంచి ఉదాహరణ అని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. తాను పడిన ఈ కష్టమంతా ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన పైనే ఆధారపడి ఉందంటూ ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ సినిమా కోసం నా శ్రమ, నిద్రపోని రాత్రులు లెక్కలోకి రావు. థియేటర్లలో ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు హిట్ సాధించిందని ప్రకటిస్తే చాలు.. అదే నాకు లభించే అసలైన ఆనందం, నా కష్టానికి దక్కే నిజమైన బహుమతి” అని చెప్పుకోచ్చారు.

Also Read :  Buchi Babu: 'పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు': బుచ్చిబాబు

ఉత్తరాంధ్ర నేపథ్య కథాంశంతో సాగే ఓ శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది తెరకెక్కింది. ఈ మూవీలో రామ్ చరణ్ మునుపెన్నడూ కనబడనంత ఊరమాస్ అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ అగ్ర నటుడు శివ రాజ్‌కుమార్, జగపతి బాబుల పవర్‌ఫుల్ రోల్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని సమాచారం.