The Mask : ఈటీవీ విన్ ఆంథాలజీ సిరీస్ ‘4 టేల్స్’ మొదలైంది – ‘ది మాస్క్’తో గ్రాండ్ స్టార్ట్!

4tales
The Mask : ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్ ని మన ముందుకు తీసుకొచ్చింది, ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. సినిమా రంగంలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన ‘కథా సుధ’ లో భాగంగా ఈ వారం ‘4 టేల్స్’ లోని మొదటి కథ, ‘ది మాస్క్’ ని ప్రీమియర్ చెయ్యడం జరిగింది. అయితే ‘4 టేల్స్’ చిత్ర ట్రైలర్ ని దిగ్గజ దర్శకులు ఆర్జీవీ గారు, హరీష్ శంకర్ గారు మరియు ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జి.వి.ప్రకాష్ గారు లాంచ్ చెయ్యడం విశేషం.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

Mask

ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఒక యువకుడు, ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఎటువంటి ఆపదలో చిక్కుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసాడనేది ఈ చిత్ర కథాంశం. ఇంత చిన్న కథాంశంలో సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్ ని మిళితం చేసి దర్శకుడు బుల్లి తెరమీదే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా వుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

‘నరుడి బ్రతుకు నటన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రిషికేశ్వర్ యోగి సమర్పణలో, ‘కథా గని పిక్చర్స్’ బ్యానర్ పై కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘ది మాస్క్’ ఈ ఆదివారం(12-10-2025) నుండే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ లు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: అక్షయ్ వసూరి, సంగీతం: విశాల్ భరద్వాజ్, ఎడిటింగ్: రిషికేశ్వర్ యోగి, సహా నిర్మాతలు: బేబీ విరాన్ష, దీపిక అలోల, ఎక్షిగ్యూటివ్ ప్రొడ్యూసర్: ద్రువ్ చిత్రణ్.