
Hombale Films: భారతీయ చిత్ర పరిశ్రమలో ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films). తాజాగా ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థ రిలీజ్ చేసిన సరికొత్త ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్ట్ సినిమా ప్రియుల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
“కొన్ని ఆరంభాలు అస్సలు శబ్దం చేయవు. కానీ అవి ఎప్పటికీ నిలిచిపోయే ప్రతిధ్వనులను సృష్టిస్తాయి. రాబోయే తదుపరి గర్జన కేవలం గుసగుసలా ఉండదు (చాలా భయంకరంగా ఉండబోతోంది). సిద్ధంగా ఉండండి! ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 2:19 గంటలకు అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాం” అంటూ చేసిన ఈ పవర్‌ఫుల్ పోస్ట్ చూస్తుంటే.. హోంబలే ఫిల్మ్స్ మరో మైండ్ బ్లోయింగ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు స్పష్టమవుతోంది. “తదుపరి గర్జన” అనే పదాన్ని వాడటంతో ఇది పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లేదా ఇప్పటికే ఉన్న ఏదైనా బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ అయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభాస్ – ఆధిత్యధర్ కాంబోకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిమిషం నిమిషానికి అంచనాలను పెంచేస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వివరాలు తెలియాలంటే.. ఈ రోజు మధ్యాహ్నం 2:19 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఈ సంచలన ప్రకటన కోసం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Some beginnings don’t make noise.
They create echoes that last forever.The next roar won’t whisper. Get Ready!
𝐔𝐧𝐯𝐞𝐢𝐥𝐢𝐧𝐠 𝐓𝐨𝐝𝐚𝐲 𝐚𝐭 𝟐:𝟏𝟗 𝐏𝐌.@HombaleFilms pic.twitter.com/xUFxBlg5hG
— Hombale Films (@hombalefilms) June 29, 2026
