Hombale Films: సంచలనానికి సిద్ధమైన హోంబలే ఫిల్మ్స్.. గర్జన మామూలుగా ఉండదంటూ హింట్!

Hombale Films

Hombale Films: భారతీయ చిత్ర పరిశ్రమలో ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films). తాజాగా ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థ రిలీజ్ చేసిన సరికొత్త ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్ట్ సినిమా ప్రియుల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

“కొన్ని ఆరంభాలు అస్సలు శబ్దం చేయవు. కానీ అవి ఎప్పటికీ నిలిచిపోయే ప్రతిధ్వనులను సృష్టిస్తాయి. రాబోయే తదుపరి గర్జన కేవలం గుసగుసలా ఉండదు (చాలా భయంకరంగా ఉండబోతోంది). సిద్ధంగా ఉండండి! ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 2:19 గంటలకు అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాం” అంటూ చేసిన ఈ పవర్‌ఫుల్ పోస్ట్ చూస్తుంటే.. హోంబలే ఫిల్మ్స్ మరో మైండ్ బ్లోయింగ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు స్పష్టమవుతోంది. “తదుపరి గర్జన” అనే పదాన్ని వాడటంతో ఇది పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లేదా ఇప్పటికే ఉన్న ఏదైనా బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ అయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభాస్ – ఆధిత్యధర్ కాంబోకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిమిషం నిమిషానికి అంచనాలను పెంచేస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వివరాలు తెలియాలంటే.. ఈ రోజు మధ్యాహ్నం 2:19 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఈ సంచలన ప్రకటన కోసం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.