
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ 2022లో పాన్-ఇండియా హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో ప్రభాస్ లాంచ్ చేయగా, ఇతర భాషల్లో హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 107 మిలియన్ వ్యూస్, 3.4 మిలియన్ లైక్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత మేకింగ్, విజువల్స్, నిర్మాణ విలువలపై చర్చ మొదలైంది. ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచిన ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












