Kingdom USA Premieres : అమెరికాలో కింగ్డమ్ క్రేజ్, జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్‌!

Kingdom premieres
విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం “కింగ్డమ్” యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే 64 లొకేషన్లలో 135 షోలకు టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం కోసం $15,000 (దాదాపు ₹13.63 లక్షలు) విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఏమాత్రం ట్రైలర్ విడుదల చేయకుండానే, ప్రమోషనల్ ఈవెంట్లు లేకుండానే ఈ స్థాయిలో స్పందన లభించడం “కింగ్డమ్” సినిమాపై ఉన్న హైప్‌ను బలంగా చూపిస్తోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.